అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈశ్వర్ అనే యువకుడు కరోనా మహమ్మారి వల్ల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసులు మగ దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాని పరామర్శించి తక్షణ సహాయంగా రూ.20, 000 వారి కుటుంబానికి అందజేశారు. పిల్లల చదువు కోసం 10వ తరగతి వరకు తన వంతు సహాయం చేస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. చుట్టుపక్కల కాలనీ ప్రజలు సీఐ శ్రీనివాసులు ఆ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకున్నందుకు అభినందించారు.