గ్రామంలో తాగునీటి కుళాయిలు ఏర్పాటు

1761பார்த்தது
గ్రామంలో తాగునీటి కుళాయిలు ఏర్పాటు
అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిధిలోని రెడ్డివారిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిల ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన దేశాయ్ విధుర శేఖరరెడ్డి, సొంత నిధులతో 48కుటుంబాలకు ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ కుళ్ళాయిలు వద్ద నీరు వృథాగా కావడం నీరు నిల్వ ఉండి దోమలు పెరగడానికి గ్రామంలో అపరిశుభ్రత ఏర్పడుతుందన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత ఉంచటానికి తన వంతు సహకారం ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி