భారీగా గుట్కా, లిక్కర్ స్వాధీనం

2561பார்த்தது
అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలో గల యు. రంగాపురం చెక్ పోస్టులో తుముకూరు నుండి తెలంగాణ రాష్ట్రానికి ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా, లిక్కర్ ను తనిఖీల్లో భాగంగా గుర్తించి వాటిని సీజ్ చేసి కేసును నమోదు చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో వివరాలను డీఎస్పీ మహబూబ్ బాషా తెలియజేశారు. బెంగుళూరుకు చెందిన సయ్యద్ ఫజల్, ఇర్షాద్, మైసూర్ కు చెందిన సయ్యద్ అమీన్ అహ్మద్ అనే ముగ్గురు వ్యక్తులు కొంతకాలంగా మడకశిర మీదుగా తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా గుట్కా మద్యం ను తరలిస్తున్నట్లు సమాచారం అందిందని దీనిలో భాగంగానే స్థానిక ఎస్ఐ శేషగిరి తన సిబ్బందితో గత వారం రోజులుగా నిఘా నేత్రాలు ఉంచి వీరిని పట్టుకున్నారని తెలిపారు.

120 సంచులలో నిల్వ ఉంచిన వీటి విలువ దాదాపు 48 లక్షల 58 వేల రూపాయలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. సీజ్ చేసిన వాటిలో కేఏ 01 ఏజి9227 రిజిస్ట్రేషన్ నెంబరు గల ఐచర్ వాహనాన్ని, విమల్ గుట్కా, పాన్ మసాల, బాద్ షాలు, 192 మద్యం పాకెట్లు భారీ మొత్తం విలువ గల వాటిని సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వారం రోజులుగా రాత్రిళ్లు నిద్రను సైతం లెక్క చేయకుండా వీరి పై నిఘా ఉంచి వీరిని పట్టుకున్న తీరు అమోఘమని ఎస్ఐ శేషగిరిని సిబ్బందిని డీఎస్పీ మహబూబ్ బాషా స్థానిక సీఐ రాజేంద్రప్రసాద్ అభినందించారు. ఈ దాడులలో ఏఎస్ఐ మోతిలాల్నాయక్ , హెడ్ కానిస్టేబుల్ జయరాంనాయక్, కానిస్టేబళ్లు మసూద్ వలి, నాగేంద్ర, జనార్ధన్, సుధాకర్, సంజీవ, హోంగార్డులు రామప్ప, బాలరాజు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி