సీఎం తాండా కొండ ప్రాంతం సందర్శించిన ఎమ్మెల్యే

2376பார்த்தது
సీఎం తాండా కొండ ప్రాంతం సందర్శించిన ఎమ్మెల్యే
కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి గాండ్లపెంట మండలం, వేపరాళ్ళ పంచాయితి, సీఎం తాండాను ఉపాధిహామీ, ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులతో కలసి సందర్శించారు. సీఎం తాండా చెరువునకు సమీపంలో గల కొండ ప్రాంతంలో పడిన వర్షపు నీరు చెరువునకు చేరకుండా దిగువునకు వెల్లడం వల్ల చెరువులో నీటి నిల్వ తగ్గిపోవడంతో అధిక త్రాగునీటి కొరత మరియు వ్యవసాయం బోర్లు త్వరగా ఎండిపోవడంతో ప్రాంత ప్రజలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నారన్న ఈ సమస్యను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే ఆ ప్రాంతంను సందర్శించారు.

కొండప్రాంతం నుండి జాలువారిన ప్రతి నీటి బొట్టును తాండా చెరువునకు చేరుటకు ప్రవాహం నకు అడ్డంగా ఉపాధి హామీ పథకం ద్వారా ట్రెంచ్ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే, అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమాదేవి, ఉపాధిహామీ పథకం ఇంజనీర్ సుబ్బారెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ మోహన్, ఇరిగేషన్ జెఈ రాంజులు నాయక్, ఫారెస్ట్ అధికారులు, కన్వినర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి భాస్కర్ రెడ్డి, ఎంపిటిసి అభ్యర్థులు సోమశేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ లు రవింద్ర నాయక్, రహంతుల్లా, సిద్దార్థ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி