అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మినారాయణ, బీకే పార్థసారథిలకు శనివారం కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపులు (కన్సల్టేటివ్)కమిటీల్లో సభ్యులుగా వీరికి అవకాశం కల్పించింది. అనంతపురం ఎంపీ అంబికాలక్ష్మినారాయణ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథికి రహదారులు, రవాణాశాఖ కమిటీలో చోటు కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.