గుత్తి మండలాన్ని పొగమంచు కమ్మేసింది. మండలంలోని జక్కలచెరువు గ్రామం 67వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున మంచు ప్రభావం భారీగా కనిపించింది. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.