గుంతకల్లు పట్టణ పరిధిలోని టపాసుల విక్రయ దుకాణాలు, నిల్వ చేసే గోడౌన్స్ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతులను కలిగివుండాలని గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. దీపావళి పండుగ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పనిసరిగా టపాసులు విక్రయ దుకాణాల నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు.