గుత్తి: చంద్రమ్మ ఆలయంలో చోరీ

54பார்த்தது
గుత్తి: చంద్రమ్మ ఆలయంలో చోరీ
గుత్తి మండలం గాజులపల్లి గ్రామంలోని చంద్రమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దొంగలు గుడి తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అమ్మవారి వెండి కిరీటం, వడ్డానంతో పాటు వెండి ఆభరణాలు, సుమారు రూ. 40 వేల నగదు అపహరించారు. పూజారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி