గుత్తిలోని బెస్త వీధికి చెందిన జనసైనికుడు ధనుంజయ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాసగిరి మణికంఠ, గుత్తి టౌన్, మండల కన్వీనర్లు పాటిల్ సురేష్, చిన్న వెంకటేష్, నాగయ్య, నాగప్ప, బ్రహ్మయ్య ఆధ్వర్యంలో గురువారం మృతుడు ధనుంజయ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు.