గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో.. దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శనివారం మూడవరోజు ఆలయంలో అమ్మవారి మూల విరాట్ కు గవ్వలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.