గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డు సచివాలయాలలో డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు అప్డేట్ కోసం శుక్రవారం ప్రజలు భారీ క్యూ కట్టారు. సచివాలయం వద్ద ఎలాంటి తోపులాటలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలో మరిన్ని ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు సంబంధిత అధికారులను కోరారు.