గుత్తి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సచివాలయ నోడల్ ఆఫీసర్, సిబ్బందితో బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. సచివాలయాలలో రోజువారీ సర్వీసులు, ఆఫార్ విద్యార్థుల బర్త్ సర్టిఫికెట్లు, ప్రాపర్టీ టాక్స్, హౌస్ టు హౌస్ సర్వే తదితర అంశాలను పూర్తి చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని కోరారు.