గుత్తి స్పెషల్ సబ్ జైల్లో శనివారం రాత్రి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ శివప్రసాద్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలు ఉండే సెల్స్, వంటగదిని, భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం కాసేపు ఖైదీలతో మాట్లాడారు. జైలును పరిశుభ్రంగా ఉంచుకోవాలని జైలు అధికారికి సూచించారు.