గుత్తి ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్న బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్ పై కప్పు పెచ్చులూడి కింద పడుతున్నాయి. గతంలో పెచ్చులూడి కింద పడడంతో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు అరకొరగా మరమ్మత్తు పనులు చేపట్టారు. ప్రస్తుతం బస్టాండ్ మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.