పామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 18న సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తేజస్నా గురువారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపు ఉదయం 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సంబంధిత అధికారులు తప్పక హాజరు కావాలన్నారు.