గుంతకల్లు పట్టణంలోని సిద్ధార్థ నగర్ కాలనీలో 100 కుటుంబాలు టీడీపీ సభ్యత్వ నమోదు తీసుకొని మంగళవారం రాత్రి పార్టీలో చేరారు. వీరిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పార్టీ కండువా చేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన మహిళా మైనారిటీ నాయకురాలు గౌసియా బేగం మాట్లాడుతూ. టీడీపీ విధివిధానాలను ఆకర్షితులై చేరామన్నారు. పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.