ముదిగుబ్బలో మంగళవారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జీఎల్ నరసింహులు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెకె పల్లి భూ పోరాటం గురించి, ముదిగుబ్బ స్మశాన వాటిక, పంచాయతీ వర్కర్ల ఆర్డర్ కాపీ వారి వేతనాలు గురించి చర్చించారు. అనంతరం ముదిగుబ్బ మండల శాఖ సిపిఎం కార్యదర్శిగా పెద్దన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పెద్దన్న తెలిపారు.