ధర్మవరం గాంధీనగర్ లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు మురికిగా మారడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ మండల కన్వీనర్ జె. వి రమణ పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలోని ఏ. ఓ. రాజేశ్వరి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ. 15 రోజులు అవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.