చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా రామ్మూర్తి నాయుడు ఆకస్మిక మృతి దురదృష్టకరమని, పార్టీకి తీరని నష్టమని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ధర్మవరం పట్టణ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో సోమవారం నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.