అనంతపురం జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

64பார்த்தது
అనంతపురం జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
అనంతపురం జిల్లాలో మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. మహిళలకు జర్దోసి, మగ్గం, బ్యూటీషియన్ కోర్సుల్లో నవంబర్ 15 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మీదేవి గురువారం పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ. శిక్షణ కాలం 30 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు అనంతపురంలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி