విద్యార్థులందరికీ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) గుర్తింపు కార్డు రూపొందించే సందర్భంలో.. టీచర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ సోమవారం పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అపార్ ఐడి క్రియేట్ చేయాలంటే విద్యార్థుల వివరాలు అన్ని ఒకేలా ఉండాలన్నారు. వివరాలు లేకపోవడంతో టీచర్లపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు.