అనంతపురం నగరంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. త్వరలోనే ప్రజలు ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.