శింగనమల మండలం నాయన పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదివారం నివాళులు అర్పించారు. ఇస్కాన్ వద్ద మృతులకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆధ్యాత్మిక సేవలో ఉన్న యువకులు ఒకేసారి ఆరుమంది మృతి చెందడం చాలా బాధ కలిగించిందన్నారు. వారి కుటుంబ సభ్యుల రోదనలు చూసి ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యా రు.