అనంతపురం మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని బుధవారం మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సీఐటీయూ నాయకులు అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ తో వాగ్వాదం చేశారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే. నాగభూషణ తదితరులు మాట్లాడుతూ.. 26 మంది పారిశుధ్య కార్మికులకు నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వారి బ్యాంకు ఖాతాలోకి వేతనాలు జమ కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.