అనంతపురం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా ఎస్పీ చర్యలు

64பார்த்தது
అనంతపురం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా ఎస్పీ చర్యలు
అనంతపురం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పిటీషన్లను చట్టపరమైన పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జరిగిన సమావేశంలో ఎస్పీ జగదీష్, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ప్రజల సమస్యలను విని, సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎస్. మహబూబ్ బాషా, ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி