అనంతపురంలోని మార్కెట్ యార్డులో కార్బైడ్ ద్వారా మాగపెట్టిన రేగి పండ్లను అమ్ముతున్న వ్యాపారి అశ్వర్థ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష, రూ. 50 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం ఫస్ట్ స్పెషల్ మేజిస్ట్రేట్ శివ శంకర్ శనివారం తీర్పునిచ్చారు. 2015లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అతడిపై కేసు నమోదు చేయగా విచారణ అనంతరం అతడికి జైలు శిక్ష పడినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లీమ్ తెలిపారు.