అనంతపురం జిల్లా మద్యం షాపులకు ఎంపిక ప్రక్రియ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ నుంచి జేఎన్టీయూకు మార్చామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పేర్కొన్నారు. జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నమని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు.