జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు విద్యార్థి సంఘాలు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వి, విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పథకం లేక విద్యార్థులు ఆకలి బాధలు పడుతున్నారని అన్నారు.