డి.హిరేహాల్ మండలం సిద్దాపురం తండాకు చెందిన మూర్తినాయక్, శివకుమార్ నాయక్ లు బట్టలు కొనేందుకు బళ్లారికి వెళ్లారు. ద్విచక్రవాహనంపై తిరిగి స్వగ్రామానికి చేరుకుంటుండగా సిద్దాపురం వద్ద మట్టి కుప్పను తప్పించే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. శివకుమార్ నాయక్ తలకు బలమైన గాయం తగిలింది. మూర్తినాయక్ కు స్వల్పగాయాలయ్యాయి. శివకుమార్ నాయక్ బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు.