గుత్తిలోని సీపీఎం కార్యాలయంలో శనివారం సీపీఎం ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా అనంతరం సీపీఎం మండల కార్యదర్శి నిర్మలమ్మ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఈనెల 14న తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.