వికలాంగుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు 11 సంవత్సరాలగా సన్యాసిరావు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని చోడపల్లి ఎంపిటిసి లాలం శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రామన్నపాలెం గ్రామానికి చెందిన ధర్మిరెడ్డి సన్యాసిరావు (విలేకరి) 11వ వర్ధంతి సందర్భంగా.. అచ్యుతాపురం వికలాంగుల ఆశ్రమ పాఠశాలో సుమారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం భోజనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.