విశాఖ పోర్టు హాస్పిటల్‌ను పిపిపికి ఇవ్వొద్దంటూ సిఐటియు ఆధ్వర్యాన పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ వద్ద మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, విఎస్ పద్మనాభరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రస్తుతం 80 పడకలతో సమర్థవంతంగా నడుస్తోందన్నారు.