కిక్కిరిసిన విశాఖ పూర్ణ మార్కెట్
దీపావళి సందర్భంగా విశాఖలోని పూర్ణ మార్కెట్ కిక్కిరిసిపోయింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తపాసులు, పూజ సామాగ్రి విక్రయాలతో ఇసుకేస్తే రాలనంత జనం చేరుకున్నారు. విశాఖ నగర్ వ్యాప్తంగా ప్రజలంతా ఏ పండగ అయినా విక్రయాల కోసం పూర్ణ మార్కెట్ కే వస్తారు. అన్ని వస్తువులు ఒకే దగ్గర లభిస్తుండడంతో పూర్ణ మార్కెట్ తీవ్ర రద్దీ నెలకొంది.