జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని విశాఖ పోర్ట్ ఆధ్వర్యంలో సాలిగ్రామపురంలోని పోర్ట్ సీఐఎస్ ఎఫ్ కాంప్లెక్స్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారత దేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పోర్ట్ చైర్ పర్సన్ డా ఎం అంగముత్తు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐక్యతా పరుగును ఆయన ప్రారంభించారు.