మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రజలకు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బుధవారం నగర మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా దీపావళి పండుగ కావాలని తెలిపారు. అలాగే పర్యావరణ హితమైన దీపావళి జరుపుకోవాలని అన్నారు. బాణా సంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.