వడ్డాది పెద్దేరు వంతెనపై ఆదివారం ట్రాఫిక్ జామ్ అయింది. పక్కనున్న కాజ్ వేపై నీరు ప్రవహించడం వలన పాత వంతెనపై వాహనదారుల రాకపోకలు సాగించాల్సివచ్చింది, ఆదివారం వడ్డాది సంత కావడంతో వాహనాలు, పాదచారులు ఇదే వంతెనపై రాకపోకలు సాగించడం వలన ఇబ్బంది ఏర్పడింది. స్థానిక యువకులు ట్రాఫిక్ నియంత్రణ చేశారు. ఏజెన్సీలో వర్షలు కురవడటంతో పెద్దేరు నిండిపోయింది. దీంతో పెద్దేరు కాజువే వంతెనపై నుండి నీరు ప్రవహించింది