అచ్యుతాపురంలో అభిజిత్ పరిశ్రమ యాజమాన్యం వెంటనే లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు గురువారం డిమాండ్ చేశారు. గత 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఈనెల 11వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు.