అచ్యుతాపురం అభిజిత్ పరిశ్రమ యజమాన్యం, లేబర్ కాంట్రాక్టర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఈనెల 6వ తేదీ నుంచి లే ఆఫ్ ఎత్తివేసి కంపెనీని తెరిచేందుకు యాజమాన్యం అంగీకరించింది. కార్మికులు అందరూ బుధవారం విధులకు హాజరుకావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.