ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించనున్నట్టు విశాఖ దక్షిణ నియోజవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, అధికారులతో కలసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ప్రజలను స్వయంగా కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కురుపాం మార్కెట్ ఆధునికరించి, ఖాళీ స్థలంలో కళ్యాణమండపం నిర్మించాచాలని పలువురు కోరారు.