బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కె వి ఎస్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఈనెల తొమ్మిదవ తేదీకి ఒడిస్సా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.