యువత రక్తదానానికి ముందుకు రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పరిషత్ సమీపంలో గల రెడ్ క్రాస్ సొసైటీలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయాలన్నారు. మనం ఇచ్చే రక్తం అత్యవసర పరిస్థితుల్లో ఇతరుల ప్రాణాలను కాపాడుతుందన్నారు.