నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ విశేషాలను అందిస్తున్న విశాఖ వాతావరణ కేంద్రానికి సోమవారం నాటికి 50 వసంతాలు పూర్తయ్యాయి. తూర్పు తీరంలో తుపాన్ల ప్రభావానికి ఎక్కువగా గురయ్యే ప్రాంతాల్లో కోస్తా ఉండడంతో భారత ప్రభుత్వం నగరంలో 1974 సెప్టెంబరు 23న తుఫాన్ హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మంగళవారం వేడుకలు నిర్వహించనున్నారు. ఈమేరకు వాతావరణ కేంద్రంలో ఏర్పాట్లు చేస్తున్నారు.