జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రహదారి పనులు

68பார்த்தது
జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రహదారి పనులు
వి. ఆర్. పురం చింతూరు మండలాల రహదారి సోకులేరు వద్ద గోదావరి వరదల కారణంగా సుమారు 6 అడుగుల మేర ఇసుక రోడ్డు పై మేట వేయటంతో రవాణా సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కొడేరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రోడ్డు పై ఉన్న ఇసుక తీసి వేసి రవాణా కల్పించాలని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ కి విన్నావించారు. వెంటనే ఆయన స్పందించి జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం తన జేసిబిని సొకులేరు వద్దకు పంపి మట్టిని తొలగించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఎస్కే షాజహాన్, ఎండి అబ్ రార్, షారుక్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி