అనుమతులు తీసుకుని బాణసంచా విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పరవాడ డి. ఎస్. పి కె. వి సత్యనారాయణ సూచించారు. బుధవారం సాయంత్రం సబ్బవరం మండలంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను సందర్శించి వ్యాపారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.