రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ బుధవారం విజయవాడలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు ఆమెను సత్కరించారు. ఈ సందర్బంగా జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్థిస్తానని, జీసీసీని ప్రగతి పథంలో నడిపిస్తానని, గిరిజనులకు మరింత అండగా ఉంటానని వివరించారు.