మాడుగుల నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలో గల కె కోటపాడు మండలం పోతనవలస గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.