విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ, భాగస్వామ్య సంస్థలతో సమావేశం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు ఆపే వరకు ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. జనవరిలో లక్ష మందితో ఉద్యమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.