వర్కింగ్ జర్నలిస్ట్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, పెండింగ్లో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యతో పాటు ఇతర సమస్యలపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర టీడీపి అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గాజువాకలో గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ గాజువాక ప్రాంతీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.