ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి. వాయుగుండంగా మారుతుందని తాజా బులెటిన్లో ప్రకటించింది. ఈ వాయుగుండం ఏపీ నుంచి పశ్చిమ బెంగాల్ మధ్య ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశముందని సోమవారం వెల్లడించింది.