విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో గుర్రం జాషువ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో అప్పారావు మాట్లాడుతూ అధిక కావ్యాలు, ఖండ కావ్యాలు, నాటకాలు, నవలలు, 35 పైగా గ్రంధాలు రాసి తెలుగు సాహిత్యాన్నిసంపన్నం చేసిన చక్రవర్తి జాషువా అన్నారు.